Pollachi Assault Case: పొల్లాచి లైంగిక దాడి కేసు.. 9 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
Pollachi Sexual Assault Case: పొల్లాచి లైంగిక దాడి, బెదిరింపుల కేసులో కోయంబత్తూరు మహిళా కోర్టు 9 మందిని దోషులుగా ప్రకటించింది. జడ్జి ఆర్ నందిని దేవి ఈ కేసులో తీర్పును వెలువరించారు. 9 మంది నిందితులకు జీవితకాల శిక్షను విధించారు. బాధిత మహిళలకు 85 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కోయంబత్తూరు: పొల్లాచి లైంగిక దాడి, బెదిరింపుల(Pollachi Assault Case) కేసులో 9 మందిని కోయంబత్తూరు మహిళా కోర్టు దోషులుగా ప్రకటించింది. జడ్జి ఆర్ నందిని దేవి ఈ కేసులో తీర్పును వెలువరించారు. తమిళనాడులో సంచలన సృష్టించిన ఆ కేసులో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
బాధితుల్లో ఎక్కువ శాతం మంది కాలేజీ విద్యార్థినులు ఉన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. అత్యాచార ఘటనలపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని చర్చించారు. ఓ బాధితురాలికి చెందిన వీడియో క్లిప్ కూడా వైరల్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మొదట స్థానిక పోలీసులు ఈ కేసును డీల్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును సీబీ-సీఐడీకి ట్రాన్స్ఫర్ చేశారు. 9 మంది నిందితులకు జీవితకాల శిక్షను విధించారు. బాధిత మహిళలకు 85 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
2019లో సీబీఐకి కేసును అప్పగించారు. నిందితులకు కఠిన శిక్షను ప్రకటించాలని సీబీఐ న్యాయవాది వాదించారు. మహిళా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా సీబీఐ కోరింది. అరెస్టు అయిన వారిలో అన్నాడీఎంకే వ్యక్తి ఒకరు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

