Vikatan Website: మోదీపై కార్టూన్.. వికటన్ వెబ్సైట్ బ్లాక్
Vikatan Website: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్‌సైట్‌ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ట్రంప్‌ను మోదీ కలిసిన అంశంపై వేసిన కార్టూన్ వివాదాస్పదం కావడంతో.. ఆ వెబ్‌సైట్‌ను కేంద్రం బ్లాక్ చేసింది.
చెన్నై: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్సైట్(Vikatan Website)ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ వద్ద మోదీ సంకెళ్లతో కూర్చుకున్నట్లు వికటన్ వెబ్సైట్ ఓ కార్టూన్ వేసింది. ఫిబ్రవరి 10వ తేదీన ఆ కార్టూన్‌ను పబ్లిష్ చేశారు. 15వ తేదీ నుంచి ఆ వెబ్సైట్ అందుబాటులో లేదని వికటన్ సంస్థ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ తీసుకున్న నిర్ణయం వల్ల వెబ్సైట్ బ్లాక్ అయినట్లు వికటన్ తెలిపింది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సైట్‌ను బ్లాక్ చేశారని వెల్లడించారు.
వెబ్సైట్ బ్లాక్ చేసిన తర్వాత ఫిబ్రవరి 20వ తేదీన విచారణ చేపట్టారు. భావ స్వేచ్చతో ఆ కార్టూన్ వేసినట్లు విచారణ సమయంలో వికటన్ తన వాదనను సమర్థించుకున్నది. అయితే ఫిబ్రవరి 25వ తేదీన మాత్రమే తమకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందినట్లు వికటన్ వెల్లడించింది. వెబ్సైట్ బ్లాక్ చేసిన అంశంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు వికటన్ పేర్కొన్నది. మళ్లీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆలోచిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Vikatan is now consulting legal experts to determine appropriate next steps. The publication is pursuing all legal avenues to both defend freedom of expression and restore access to the website.#VikatanForFreedomOfExpression | #VikatanCartoonRow | #AnandaVikatan pic.twitter.com/jV1IK0EvOG
— விகடன் (@vikatan) February 27, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blocked
- cartoon
- Modi
- Tamil website
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

