మంత్రి కారు వద్ద పటాకుల కాల్పులు.. హత్యాయత్నం ఫిర్యాదు

చెన్నై: ఒక మంత్రి కారు వద్ద ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చారు. దీంతో తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంతోపాటు ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. అధికార అన్నాడీఎంకేకు చెందిన సమాచార, ప్రచార శాఖ మంత్రి కదంబర్ రాజు ఆదివారం కోవిల్పట్టిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కారులో వెళ్తుండగా ఏఎంఎంకే కార్యకర్తలు పటాకులు పేల్చారు. ఈ నేపథ్యంలో తనపై హత్యకు ప్రత్యర్థి కార్యకర్తలు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఏఎంఎంకే కార్యకర్తలు తన కారును అడ్డుకుని పటాకులు కాల్చారని, తద్వారా అందులో ఉన్న తనతోపాటు కారుకు నిప్పుపెట్టబోయారని కదంబర్ రాజు తెలిపారు. తాను తృటిలో తప్పించుకున్నానని లేనిపోతే కారుకు మంటలు అంటుకుని తాను మరణించి ఉండేవాడినని అన్నారు. ఎన్నికల్లో తన గెలుపునకు భయపడి తనను హత్య చేసేందుకు ఏఎంఎంకే ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు అన్నాడీఎంకే కేంద్ర కార్యదర్శి దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, తమ కార్యకర్తలపై మంత్రి కదంబర్ రాజు చేసిన ఆరోపణలపై ఏఎంఎంకే ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

