TN CM Vijay : తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) తిరుచ్చి ఈస్ట్ (Trichi East) అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. పెరంబూర్ (Perambur) అసెంబ్లీ స్థానాన్ని ఆయన అట్టిపెట్టుకున్నారు. దాంతో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. టీవీకే చీఫ్ విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల నుంచి పోటీచేశారు. మే 4న వెలువడిన ఫలితాల్లో ఆయన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.
అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. ఒకవేళ ఆ రెండు సీట్లలోనూ గెలిస్తే ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల నుంచి గెలిచిన విజయ్ .. ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.