సరైన కారణం లేకుండా లైంగిక సంపర్కం నిరాకరణ క్రూరత్వమే
దాంపత్య జీవితంలో సరైన కారణాలు లేకుండా లైంగిక సంపర్కాన్ని నిరాకరించడంతో పాటు.. దాంపత్య హక్కులను తిరస్కరించడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
- అలాంటప్పుడు విడాకులు కోరొచ్చు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, జూన్ 6: దాంపత్య జీవితంలో సరైన కారణాలు లేకుండా లైంగిక సంపర్కాన్ని నిరాకరించడంతో పాటు.. దాంపత్య హక్కులను తిరస్కరించడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాంటి కేసుల్లో హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 13(1) (ఐఎ) ప్రకారం విడాకులు కోరే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పదే పదే లైంగిక సంపర్కాన్ని నిరాకరించడం వివాహ బంధంలోని పునాదినే దెబ్బ తీస్తుందని.. ఇది మానసిక వేదనకు కార ణం అవుతుందని ఇప్పటికే భారతీయ కోర్టులు పలుమార్లు గుర్తించాయని సుప్రీంకోర్టు చెప్పింది. రాజస్థాన్ హైకోర్టు గతంలో ఓ డాక్టర్ ఇలాంటి కేసులో విడాకులు కోరగా మంజూరు చేసింది. ఆ తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరగ్గా జస్టిస్ సంజయ్ కరూల్, ఆగస్టీన్ జోర్జ్ మసిలతో కూడిన ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చారు.
కేసు ఏమిటి?
రాజస్థాన్ కు చెందిన ఓ డాక్టర్ తన భార్య లైంగిక సంపర్కాన్ని నిరాకరిస్తోందని విడాకులు కోరారు. ఆయన భార్య రోజూ త్వరగా పడుకుంటుంది. తన రూమ్కు లోపలి నుంచి లాక్ వేసుకుంటుంది. చేసేది లేక పిటిషనర్ వేరే రూమ్ లో పడుకుంటున్నారు. దీంతో భర్త విడాకులు కోరుతూ కోర్టుమెట్లు ఎక్కారు. కోర్టు మానసిక క్రూరత్వం కింద విడాకులు మంజూరు చేసింది. దాంపత్యం అంటే ఇద్దరూ కలిసి జీవించాలి తప్ప.. బలవంతంగా అమలు చేయించే ఏకపక్ష హక్కు కాదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

