CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
CJP protest : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, శనివారం ఆందోళన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు మూసివేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
CJP protest : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, శనివారం ఆందోళన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జంతర్ మంతర్ సమీపంలోని పలు మెట్రో స్టేషన్లను, రైలు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. నిరసన ఉన్నంతమాత్రాన రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు మూసివేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు, ఇతర స్థానిక రైల్వే స్టేషన్లను ప్రభుత్వం మూసివేయనుంది. శుక్రవారం రాత్రి 9.00 గంటల నుంచే వీటిని మూసివేయనున్నారు. అక్టోబర్ 10, శనివారం కూడా పూర్తిగా మూసి ఉంటాయి. ఎటువంటి ఆందోళన, హింస తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం వల్ల లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడతారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ఆందోళన కార్యక్రమాలు ఉన్నంతమాత్రాన అన్ని మెట్రో స్టేషన్లను మూసివేసి, రైల్వే సేవలు నిలిపివేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా మూసివేయడం వల్ల గురుగ్రామ్, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేయకూడదని, ప్రత్యామ్నాయా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇదే సమయంలో పౌరుల భద్రత విషయంలో రాజీ పడకూడదని సూచించింది. దీనిపై ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. ఇదే సమయంలో నిరసనలకు వేదికవుతున్న జంతర్ మంతర్ అంశంపై కోర్టు స్పందించింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ వేదికల్ని సిద్ధం చేయొచ్చు కదా అని సూచించింది. జంతర్ మంతర్ ప్రదేశం చాలా చిన్నగా ఉందని, ఇది ఉన్న ప్రదేశం కూడా ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు.. నిరసనకారులు ఆహారం తీసుకునేందుకు, శానిటేషన్‌కు, అంబులెన్సులు రావడానికి ఇబ్బందిగా ఉందని కోర్టు తెలిపింది. ధర్నాలు, నిరసనల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

