పెరారివాలన్‌ను రిలీజ్ చేయండి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్‌కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితానికి గుడ్‌బై చెప్పనున్నాడు. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ధర్మాసనం ఈ ఆదేశం చేసింది. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్‌ను విడుదల చేయాలని పెట్టుకున్న అభ్యర్థనపై తమిళనాడు గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవడం జాప్యం చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. పెరారివాలన్ రిలీజ్‌కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది.
రాజీవ్ గాంధీ హత్యకు వాడిన బాంబు పరికరాలను పెరారివాలన్ అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ హత్య సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. ఈ కేసులో అతను దోషిగా తేలాడు. 1998లో అతనికి మరణశిక్షను ఖరారు చేశారు. ఆ తర్వాత 2014లో సుప్రీం ఆ శిక్షను జీవితకాల శిక్షగా మార్చింది. ఇక ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్‌ను మంజూరీ చేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన హతమార్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

