సెంటర్ల వారీగా నీట్ ఫలితాలు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలవారీగా నీట్-యూజీ ఫలితాలను శనివారం జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) విడుదల చేసింది. మే 5న ఈ పరీక్ష జరగగా జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి.
- సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల చేసిన ఎన్టీఏ
- హర్యానా కేంద్రంలో పూర్తి భిన్నమైన ఫలితాలు
న్యూఢిల్లీ, జూలై 20: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలవారీగా నీట్-యూజీ ఫలితాలను శనివారం జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) విడుదల చేసింది. మే 5న ఈ పరీక్ష జరగగా జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం వివాదంగా మారింది. నీట్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. అయితే, అక్రమాల నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి విచారిస్తున్న ధర్మాసనం.. నీట్ ఫలితాలను పరీక్ష కేంద్రాలు, నగరాలవారీగా విడుదల చేయాలని ఎన్టీఏను గురువారం ఆదేశించింది.
ఆ కేంద్రంలో ఫలితాలు తారుమారు
మొదట విడుదల చేసిన నీట్-యూజీ ఫలితాల్లో హర్యానాలోని బహదుర్గఢ్లో ఉన్న హర్దయాల్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఆరుగురికి 720కి 720 మార్కులు రావడం తీవ్ర వివాదమైంది. మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. గతంలో దేశమంతా కలిపి ఒకరిద్దరికి మాత్రమే ఇలా పూర్తి మార్కులు వచ్చేవి. ఈసారి ఒకే కేంద్రంలో ఆరుగురికి 100 శాతం మార్కులు రావడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయాన్ని నష్టపోయినందుకు గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఇలా అసాధారణ ఫలితాలు వచ్చినట్టు ఎన్టీఏ చెప్పింది. తర్వాత గ్రేస్‌మార్కులు రద్దు చేసింది. ఇప్పుడు పరీక్ష కేంద్రాలవారీగా వెల్లడించిన ఫలితాలు ఈ కేంద్రంలో మొదట ప్రకటించిన ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఈ కేంద్రంలో 494 మంది పరీక్ష రాయగా అత్యధికంగా ఒక విద్యార్థికి 682 మార్కులు మాత్రమే వచ్చాయి. మరో 13 మంది విద్యార్థులకు 600కు పైగా మార్కులు వచ్చాయి.
సికార్ జిల్లాలో సంచలన ఫలితాలు
రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులు సాధించారు. జిల్లాలో 6,038 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 149 మంది 700కు పైగా మార్కులు సాధించారు. 2,037 మంది 650కి పైగా మార్కులు, మొత్తంగా 4,297 మంది విద్యార్థులు 600కి పైగా మార్కులు తెచ్చుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సెంటర్లో 1,968 మంది పరీక్ష రాయగా ఏకంగా 112 మంది 700కు పైగా మార్కులు సాధించారు.
నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
నీట్-యూజీ అక్రమాల కేసులో శనివారం సీబీఐ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఒకడైన శశికాంత్ పాశ్వాన్ ఎన్ఐటీ జంషేద్పూర్లో బీటెక్(ఎలక్ట్రికల్) పూర్తి చేశాడు. పేపర్ లీక్ కేసులో కీలక నిందితులైన పంకజ్ కుమార్, రాకీతో ఇతడికి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. రాజస్థాన్‌లోని భరత్పూర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కుమార్ మంగళం బిష్ణాయ్, దీపేందర్ శర్మను కూడా సీబీఐ అరెస్టు చేసింది. వీరిద్దరు పంకజ్ కుమార్ దొంగలించిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాసినట్టు సీబీఐ పేర్కొన్నది. ఈ ముగ్గురి అరెస్టుతో సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 21కి చేరుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

