Supreme Court | సుప్రీంకోర్టు ముందడుగు.. విచారణ సమయంలో ఆ పదాలు వాడకుండా నిషేధం.. హ్యాండ్‌బుక్ రిలీజ్..!
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యాఖ్యలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విడుదల చేసింది.
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యాఖ్యలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విడుదల చేసింది. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేసింది.
‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ పేరిట 30 పేజీల పుస్తకాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవిష్కరించారు. కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను హ్యాండ్‌బుక్‌లో సుప్రీంకోర్టు హ్యాండ్‌బుక్‌లో పొందుపరుస్తూ.. వాటి బదులుగా వాడాల్సిన పదాలను సూచించింది. కోర్టు తీర్పుల సమయంలో మహిళపై వివక్ష చూపే విధంగా వినియోగించే పదాలు సరైనవి కావని, అయితే, ఆ తీర్పులను విమర్శించడం పుస్తకం ఉద్దేశం కాదన్నారు. లింగత్వానికి సంబంధించి మూసపద్ధతులు ఎలా ఆచరణలో ఉన్నాయో చెప్పేందుకే హ్యాండ్ బుక్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
లింగ వివక్షకు నిర్వచనం, న్యాయాధికారుల్లో అవగాహనను పెంపొందించడం ఈ బుక్లక్ష్యమని సీజేఐ పేర్కొన్నారు. మహిళలపై మూసధోరణిలో వాడే పదాలను గుర్తించేందుకు న్యాయమూర్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, సుప్రీం కోర్టు వెబ్సైట్లో హ్యాండ్‌బుక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ 30 పేజీలతో కూడిన హ్యాండ్ బుక్‌ను మహిళా న్యాయమూర్తుల కమిటీ రూపొందించింది. కమిటీలో జస్టిస్ ప్రభా శ్రీదేవన్, జస్టిస్ గీతా మిట్టల్, ప్రొఫెసర్ జుమా సేన్ ఉన్నారు. అలాగే కమిటీకి కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌషుమీ భట్టాచార్య నేతృత్వం వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
Tummidihatti | తమ్మిడిహట్టి పాట.. రేవంత్ తొండాట.. ఏదీ తేలకున్నా ఏదో సాధించినట్టు కాంగ్రెస్ గొప్పలెందుకు?
Horoscope | 27-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
రక్తపోటుపై రీనల్ డీనర్వేషన్ అస్త్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

