Supreme Court | ‘న్యాయస్థానానికే అబద్ధాలు చెబుతావా’.. కమెడియన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court | దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా (Samay Raina) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అబద్ధాలు చెప్పి న్యాయవ్యవస్థను అవహేళన చేశావంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకుగానూ రూ.3 లక్షల జరిమానా విధించింది.
Supreme Court : దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా (Samay Raina) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అబద్ధాలు చెప్పి న్యాయవ్యవస్థను అవహేళన చేశావంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకుగానూ రూ.3 లక్షల జరిమానా విధించింది. కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా (Ranveer Alahabadia) తోపాటు మరికొందరు కమెడియన్లు తమ అభ్యంతరకర వ్యాఖ్యలతో దివ్యాంగుల మనసు బాధించేలా జోకులు వేశారని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. దివ్యాంగులకు కావాల్సింది గౌరవ మర్యాదలని, వారి విజయాలను కమెడియన్లు తమ వేదికల్లో చాటిచెప్పాలని సూచించింది. ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం.. సమయ్ రైనా తన షోలకు దివ్యాంగులను ఆహ్వానించలేదని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ ధర్మాసనానికి తెలిపింది.
దాంతో న్యాయస్థానం కమెడియన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘సమయ్ రైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే గాక.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దేశం వెలుపల ఉంటే తాము చట్టపరిధిలోకి రామని వారు భావిస్తున్నట్లున్నారు. ఇది పూర్తిగా అహంకారమే. ఇందుకు వారికి శిక్ష పడాల్సిందే’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహించింది. సమయ్ రైనాకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
అయితే ఆ తర్వాత కమెడియన్ తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో జరిమానాను రూ.3 లక్షలకు తగ్గించింది. మరోసారి తప్పు చేస్తే ఈ మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచుతామని హెచ్చరించింది. జరిమానాను రెండు వారాల్లోగా సుప్రీంకోర్టుకు డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

