ED SK Mishra: సెప్టెంబర్ 15 వరకు ఎస్కే మిశ్రానే ఈడీ డైరెక్టర్
ED Director Sanjay Kumar Mishra: ఎస్కే మిశ్రానే ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్రం వేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీం బెంచ్ విచారణ చేపట్టింది. సెప్టెంబర్ 15 తర్వాత మళ్లీ కొనసాగింపు ఉండదని సుప్రీం హెచ్చరించింది.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) డైరెక్టర్‌గా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా(SK Mishra) కొనసాగనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఆయన్ను కొనసాగిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఎటువంటి పొడిగింపు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, విక్రమ్‌నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజా పిటిషన్ ను పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంను కోరారు. దీంతో తాజా పిటిషన్ ను విచారించేందుకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ పిటీషన్‌ను సుప్రీం బెంచ్ విచారించింది.
2018 నవంబర్ లో సంజయ్ కుమార్ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఆయనకు 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే, నవంబర్ 2020 లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులను సవరించింది. అనంతరం 2022లోనూ మూడోసారి ఆయన పదవీ కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ పలువురు నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

