బాలాసోర్ : ఒడిశా బాలాసోర్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పినాక రాకెట్ ట్రయల్స్ నిర్వహించింది. రాకెట్‌ను సోమవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణలో కొత్త ఆయుధాల తయారీలో నిమగ్నమైన డీఆర్డీవో పినాక రాకెట్ రేంజ్‌ను పెంచేందుకు ఇటీవల గత కొద్ది రోజులుగా బాలాసోర్‌తో పాటు రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో డీఆర్డీవో యూజర్ ట్రయల్స్ చేపట్టగా.. విజయవంతమయ్యాయి. మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ పినాక సామర్థ్యాన్ని పెంచేందుకు సహకారం అందించాయి. పినాక ఎంకే-1 అనేది అప్‌గ్రేడ్ రాకెట్ సిస్టమ్. దీన్ని గతంలో పలుసార్లు విజయవంతంగా పరీక్షించారు. పినాక ఎంకే-1 రాకెట్ వ్యవస్థ రేంజ్ 45 కిలోమీటర్లు కాగా.. పినాక-2 రాకెట్ రేంజ్ 60 కిలోమీటర్లు. రాకెట్ వ్యవస్థను రెండు డీఆర్డీవో ప్రయోగశాలలు, ఆర్డినెన్స్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL), రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ARDE) సంయుక్తంగా రూపొందించాయి.