BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. భార్యతో కలిసి రాజీనామా చేస్తానని బెదిరింపు
BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. (BJP MLA Threatens To Quit) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటవీ, పర్యావరణ మంత్రి నాగర్సింగ్ చౌహాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రామ్నివాస్ రావత్‌కు ఈ శాఖ బాధ్యతలు అప్పగించారు.
కాగా, 25 ఏళ్లుగా బీజేపీలో అంకితభావంతో పనిచేసిన నాగర్సింగ్ చౌహాన్ తన బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీ చర్యలు తనకు వ్యక్తిగతంగానే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగించాయని అన్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విధేయుడైన ఆయన బీజేపీని తీవ్రంగా హెచ్చరించారు. ‘నేను పార్టీపై కోపంగా ఉన్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు, పార్టీ లేదా ప్రభుత్వం నాకు ఏ సమాచారం ఇవ్వలేదు. పార్టీలో నా అభిప్రాయాలు వెల్లడిస్తా. నిర్ణయం తీసుకోకపోతే 1-2 రోజుల్లో రాజీనామా చేస్తా. రత్లాం ఎంపీ అయిన భార్య అనితా కూడా నాతో పాటు రాజీనామా చేస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

