ఈసారి దేశవ్యాప్తంగా 98 శాతం వర్షపాతం : ఐఎండీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉండనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని చెప్పింది. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా 98 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర భూగర్భ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. ప్రతి ఏడాది జూన్ ఒకటి నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయన్న విషయం తెలిసిందే. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గత ఏడాది సగటు కన్నా ఎక్కువ స్థాయిలో దేశమంతా వర్షపాతం నమోదైంది. ఇండియాలో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వస్తుంది. అయితే ఈ సారి ఆ సమయంలో వర్షపాతం 96 నుంచి 104 శాతం ఉంటుందని ఐఎండీ తన ప్రకటనలో పేర్కొన్నది. కానీ సగటున ఆ వర్షపాతం 98 శాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆధారంగా ఈ అంచనా వేస్తారు. వర్షాకాలంలో కురిసే సగటు వర్షం 1961 నుంచి 2010 మధ్య కాలంలో 88 సెంటీమీటర్లుగా ఉన్నది. పసిఫివ్, హిందూ మహాసముద్రాల్లో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. ఈ రెండు సముద్రాల ఉష్ణోగ్రతలు .. భారతీయ రుతుపవనాలపై ప్రభావం చూపనున్నాయి. అయితే మరోసారి రుతుపవనాలపై మే నెల చివర్లో ఐఎండీ అప్డేట్ ఇవ్వనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

