అసంతృప్తి ఇక్కడే వెళ్లగక్కేయండి.. బయట కుదరదు.. సోనియా లక్ష్మణ రేఖ
ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ వేదికగా… కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నేతలకు లక్ష్మణ రేఖ గీచారు. పార్టీపై అసంతృప్తి ఉన్నా, లేదన్నా ఇబ్బందులున్నా… ఇతర సమస్యలు ఏవున్నా.. చింతన్ శిబిర్ సమావేశాల్లో స్వేచ్ఛగా చెప్పాలని సూచించారు.
ఆయా నేతల అభిప్రాయాలు, ఇబ్బందులు, సమస్యలు ఏవున్నా.. ఈ వేదిక మీదనే చర్చించాలని, అందుకు తగ్గ పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ అంతా ఏకతాటిపై ఉందన్న అభిప్రాయాన్ని సమాజానికి పంపాలని సూచించారు. అంతేకానీ.. బయట మాత్రం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అసంతృప్తి వెళ్లగక్కొద్దని సోనియా సూచించారు.
ఇన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ అందరికీ ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సోనియా ఉద్బోధించారు. పార్టీకి అందరూ బాకీ పడ్డారని, ఆ బాకీని తీర్చేయాలని విస్పష్టంగా సూచించారు. ఈ శిబిరం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కొత్త ఉత్సాహం, కొత్త నిబద్ధతతో, సరికొత్త నిబద్ధతో వెళ్లాలని సోనియా ప్రతినిధులకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

