సైలెంట్‌గా తొలగింపులు
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.
- 2023లో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన 20 వేల మంది టెకీలు
- ఏఐఐటీఈయూ గణాంకాల వెల్లడి
- ఉద్యోగులతో స్వచ్ఛంద రాజీనామాలు
- అన్ని స్థాయిల కంపెనీల్లో ఉద్వాసనలు
న్యూఢిల్లీ, మే 28: దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది. 2024లో భారత టాప్ ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో దాదాపు 2-3 వేల మంది ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు కోల్పోయారని ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్ఐటీఈఎస్ తెలిపింది.
‘టెర్మినేటెడ్’ ముద్ర పడితే కష్టం
కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు పలు మార్గాలు పాటిస్తున్నాయి. 2-3 నెలల జీతం తీసుకొని స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన వారిని వెంటనే తొలగిస్తున్నారు. రిలీవింగ్ లెటర్‌పై ‘టెర్మినేటెడ్’ అనే ముద్ర పడితే మరో ఉద్యోగం పొందేందుకు కష్టమవుతున్నదని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్పీత్ సింగ్ పేర్కొన్నారు.
అన్ని స్థాయిల కంపెనీల్లో తొలగింపులు
బహుళజాతి స్థాయి కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని స్థాయిల్లో ఈ ఉద్యోగుల తొలగింపుల పర్వం నడుస్తున్నది. అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా నడిచే టెరాడాటా కంపెనీ గత ఏడాది చివరిలో హైదరాబాద్ క్యాంపస్‌లో 35-40 మంది ఉద్యోగులను తొలగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అసెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో కూడా ఇది నడుస్తున్నదని పలువురు ఉద్యోగులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పినట్టు ‘మనీ కంట్రోల్’ వెబ్సైట్ నివేదించింది. ఇన్ఫోసిస్ సంస్థ 2024లో 200-500 మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరడం ద్వారా తొలగించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఉద్యోగులను తొలగించినట్టు వస్తున్న వార్తలను ఇన్ఫోసిస్, ఏటూఎస్ గ్రూపు ఖండించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

