కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు ధర రూ.600 నుంచి రూ.225కు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసుగా వ్యవహరించే బూస్టర్ డోసు దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. సీరం ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా శనివారం ఈ మేరకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రైవేట్ ఆసుపత్రులలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించాలని ఎస్ఐఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని మేం ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. 18 ఏండ్లు నిండిన అందరికీ ప్రికాషన్ డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం మరోసారి అభినందిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
కాగా, పికాషనరీ డోసుపై కేంద్రం శుక్రవారం చేసిన ప్రకటనను స్వాగతించిన అదార్ పూనావాలా, కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు. అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్ డోసు కొవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రికాషనరీ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. అయితే సర్వీస్ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం శనివారం ప్రకటించింది.
We are pleased to announce that after discussion with the Central Government, SII has decided to revise the price of COVISHIELD vaccine for private hospitals from Rs.600 to Rs 225 per dose. We once again commend this decision from the Centre to open precautionary dose to all 18+.
— Adar Poonawalla (@adarpoonawalla) April 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

