Seema Haider | పాకిస్థాన్ మహిళ (Pakistani woman) సీమా హైదర్ (Seema Haider), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా (Sachin Meena) ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ (PUBG Game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం సీమా తన నలుగురి పిల్లలతో అతి కష్టంమీద పాకిస్థాన్ (Pakistan) నుంచి భారత్ లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్రమంగా భారత్‌కు వచ్చిన ఆమె ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. సచిన్‌ని పెళ్లాడిన సీమా వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాది శుభవార్త పంచుకుంది. తాను గర్భందాల్చినట్లు వెల్లడించింది. భర్త సచిన్ బిడ్డకు తల్లికాబోతున్నట్లు తెలిపింది (welcome first child). ఈ మేరకు ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ శుభవార్త పంచుకుంది.
పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనా (Sachin Meena)తో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి గతేడాది భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది.
Also Read..
Baraat | యూలూ బైక్స్‌పై పెళ్లి బరాత్.. వీడియో వైరల్
JN.1 | చాపకిందనీరులా విస్తరిస్తోన్న జేఎన్.1 వేరియంట్.. 263కి చేరిన కేసులు
Dawood Ibrahim | వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!