మీ నిరసనలకు అర్థమేంటి?

- వ్యవసాయ చట్టాల అంశం కోర్టులో ఉంది
- పిటిషన్ వేసింది మీరే.. నిరసన తెలిపేది మీరే
- జంతర్ మంతర్ దగ్గర రైతుల సత్యాగ్రహానికి అనుమతి పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనా.. కాదా.. అన్న అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు రైతులు ఇంకా నిరసనలు కొనసాగించడంలో అర్థం ఏంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పౌరులకు నిరసన తెలిపే హక్కుతో పాటు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. దాన్ని గౌరవించాలని, ఈ రెండు హక్కుల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రైతులు సత్యాగ్రహం చేపట్టేందుకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కిసాన్ మహాపంచాయత్ రైతు సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మహాపంచాయత్ న్యాయవాది, సుప్రీంకోర్టు మధ్య ఆసక్తికర వాదనలు జరిగాయి.
ఇక నగరం నడిబొడ్డులోనా?
తొలుత కిసాన్ మహాపంచాయత్ తరఫు న్యాయవాది.. జంతర్ మంతర్‌లో సత్యాగ్రహానికి అనుమతించాలని, అందుకు ఆదేశాలను జారీ చేయాలని కోర్టును కోరారు. దీనిపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ‘ఇప్పటి దాకా ఢిల్లీ చుట్టూ నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి చేస్తాం అంటున్నారు. మీరు ఒక్కసారి కోర్టుకు వచ్చాక న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి. కేసు పెండింగ్‌లో ఉండగానే నిరసనలు విస్తరించుకొంటూ పోతామంటే ఎలా? మీరేమైనా న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్నారా?’ అని ఘాటుగా ప్రశ్నించింది. దీనికి రైతు సంఘం తరఫు న్యాయవాది ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఆందోళనలను విస్తరించడానికి బదులు పిటిషన్‌పై వేగంగా విచారణ జరుపాలని కోర్టును కోరవచ్చని సుప్రీం కోర్టు సూచించింది.
‘మీరు మొత్తం ఢిల్లీ గొంతు నొక్కేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి ఆందోళన చేస్తాం అంటున్నారు. మరోవైపు చట్టాలను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. మీరు ఒక్కసారి కోర్టుకు వచ్చాక న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి.’
సుప్రీంకోర్టు
ప్రజల ఇబ్బందులను ఆలోచించారా?
నిరసన తెలిపే చోట అక్కడి ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనలు జరుపుతున్న ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించారా.. అక్కడ నిరసనలు తెలుపడానికి వారి అనుమతి కోరారా.. అని అడిగింది. రోడ్లను బ్లాక్ చేసిన రైతులు సెక్యూరిటీ సిబ్బందిని కూడా అడ్డుకొన్నట్టు వార్తల్లో చూశామని పేర్కొన్నది. రైతులు శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారని రైతు సంఘం న్యాయవాది బదులివ్వగా..‘శాంతియుత నిరసన ఏంటి? రైళ్లను అడ్డగిస్తారు. రోడ్లను బ్లాక్ చేస్తారు. ఇప్పుడేమో మాది శాంతియుత నిరసన, ప్రజలకు ఏం ఇబ్బంది లేదు అంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులే రోడ్లను బ్లాక్ చేశారని రైతుల తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పండి అని కోర్టు ఆదేశించింది. దీనికి రైతు సంఘం న్యాయవాది సరేనన్నారు. విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

