నాకు ఓటేస్తే.. ఐఫోన్ ఇస్తా.. చంద్రుడి మీదకు తీసుకెళ్తా

మధురై: తమిళనాడులో ఏప్రిల్ ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్య్ర అభ్యర్థి తన మ్యానిఫెస్టో రిలీజ్ చేశాడు. చిత్ర విచిత్రమైన హామీలను ఆ మ్యానిఫెస్టోలో ప్రకటించాడు. దక్షిణ మధురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ అనే అభ్యర్థి తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ఐఫోన్, కారు, హెలిక్యాప్టర్, రోబో ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇవే కాదు, స్విమ్మింగ్ పూల్ ఉన్న మూడంతస్తుల ఇంటిని, యువతకు కోటి రూపాయలతో పాటు వంద రోజుల పాటు చంద్రుడి మీదకు టూర్ తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చాడు. మధురైలో స్పేస్ రీసర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఆర్టిఫీషియల్ ఐస్‌బర్గ్‌ను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల వేళ పార్టీలు, నేతలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతుంటారని, ఓటర్లు ఆ విషయాన్ని గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఇలాంటి హామీలు ఇచ్చినట్లు శరవణన్ తెలిపాడు. సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలు.. ఆ తర్వాత వాటిని అమలు చేయవని, దానిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి హామీలతో మ్యానిఫెస్టో రిలీజ్ చేసినట్లు ఓ మీడియాతో చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

