Sabarimala Temple: తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. భక్తులను కనువిందు చేయనున్న కొత్త శిలలు
Sabarimala Ayappa temple: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇవాళ సాయంత్రం తెరవనున్నారు. మండల పూజ సీజన్ సందర్భంగా రెండు నెలల పాటు ఆ ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. ఆలయ ఎంట్రెన్స్‌లో కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఆ శిలలు భక్తుల్ని సమ్మోహన పరచనున్నాయి.
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని(Sabarimala Temple) ఇవాళ సాయంత్రం తెరవనున్నారు. మండల పూజ సీజన్ సందర్భంగా రెండు నెలల పాటు ఆ ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. తంత్రి కంటారు మహేశ్ మోహనారు.. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గుడిని ఓపెన్ చేస్తారు. కొత్త పూజారిగా పీఎన్ మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే అయ్యప్ప ఆలయం ఈసారి భక్తుల్ని విశేషంగా ఆకర్షించనున్నది.
ఆలయ ఎంట్రెన్స్‌లో కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఆ శిలలు భక్తుల్ని సమ్మోహన పరచనున్నాయి. ప్రస్తుతం ఆలయం ప్రవేశ ద్వారం వద్ద హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ 70 లక్షలు కేటాయించింది. శిలలపై అందమైన బొమ్మను చెక్కారు. స్వామియే శరణం అయ్యప్ప అని ఆ పిల్లర్స్‌పై కార్వింగ్ చేశారు.
ఆలయంలోని 18 బంగారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. వర్షం లేని సమయంలో ఆ రూఫ్‌ను ఫోల్డ్ చేసే రీతిలో తయారు చేశారు. చెన్నైకి చెందిన క్యాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది. పడి పూజ సమయంలో ఆ రూఫ్ వల్ల ఇబ్బంది ఉండదని ఆలయ అధికారులు చెబుతున్నారు.
మండల దీక్ష కోసం ఆలయాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. డిసెంబర్ 27వ తేదీన ఆ సీజన్ ముగుస్తింది. మకర సంక్రమణ పండుగ కోసం డిసెంబర్ 30వ తేదీన మళ్లీ ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. జనవరి 15వ తేదీన భారీ సంఖ్యలో భక్తుల్ని ఆలయ దర్శనం చేసుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

