ప్రచారం: కారు అద్దాలు తుడిచేవారు స్మార్ట్‌వాచ్ ద్వారా ఫాస్టాగ్ లోగోను స్కానింగ్ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం: ఫాస్టాగ్ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ కాదు. కేవలం ఫాస్టాగ్ నెట్‌వర్క్‌లోని స్కానర్ల ద్వారానే జరుగుతుంది. ఫాస్టాగ్‌ను స్కాన్ చేయడానికి ప్రత్యేక హార్డ్‌వేర్ ఉంటుంది. వేరే వ్యక్తులు ఫాస్టాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులు కొల్లగొట్టలేరు.