China scientists | మగవారిలో శృంగారంపై కోరికలు నశించడానికి కారణం అదేనట..
ఎక్కువగా శృంగార వీడియోలు చూసే మగవారిలో దానిపై కోరికలు నశిస్తాయని, సంతృప్తి అనిపించదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. శృంగార వీడియోలను ఎక్కువగా చూడటం, మత్తు పదార్థాలను వాడటం ఒకటేనని పరిశోధకులు తెలిపారు.
- శృంగార వీడియోలు మగవారిలో కోరికలు తగ్గిస్తాయి
- దూరంగా ఉండటం మేలన్న పరిశోధకులు
China scientists | న్యూఢిల్లీ, మే 28: ఎక్కువగా శృంగార వీడియోలు చూసే మగవారిలో దానిపై కోరికలు నశిస్తాయని, సంతృప్తి అనిపించదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. శృంగార వీడియోలను ఎక్కువగా చూడటం, మత్తు పదార్థాలను వాడటం ఒకటేనని పరిశోధకులు తెలిపారు. మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే శృంగార వీడియోలు చూసినప్పుడు ప్రేరేపితమవుతాయి. తద్వారా శృంగార పటుత్వం పెరుగుతుంది. దీంతో నిజ జీవితంలో శృంగారానికి, శృంగార వీడియోలకు పోలిక లేకపోవడం వల్ల దానిపై ఆసక్తి తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
వీర్య కణాల నాణ్యత తగ్గిందా?
నిద్రకు వీర్య కణాల నాణ్యతకు సంబంధం ఉందని చైనా పరిశోధకులు వెల్లడించారు. అతిగా నిద్రపోయినా, తక్కువ సమయం నిద్రకు కేటాయించినా ప్రమాదమేనని వారు తెలిపారు. కొంతమందిని ఆరు గంటలు అంతకంటే తక్కువ, కొందరిని 7-8 గంటలు, మరికొందరిని 9 గంటలు అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించి వారిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. 6 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయిన వారి వీర్యం నాణ్యత తగ్గిందని గుర్తించారు. 7-8 గంటల పాటు నిద్రించిన వారి వీర్యం నాణ్యతతో ఉన్నట్టు తేల్చారు. నిద్ర తక్కువైనా, ఎక్కువైనా వీర్యం నాణ్యతను దెబ్బతీసే యాంటీ స్పెర్మ్ యాంటీ బాడీ ప్రొటీన్లు విడుదల అవుతున్నట్టు, వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

