డిజిటల్ అరెస్టు పేరుతో న్యాయవాదికి 4 కోట్ల టోకరా
పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలున్నాయంటూ ఒక రిటైర్డ్ న్యాయవాదిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.4 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటన నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
- పహల్గాం ఉగ్రదాడితో లింకుందని బెదిరింపు
నోయిడా, నవంబర్ 17: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలున్నాయంటూ ఒక రిటైర్డ్ న్యాయవాదిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.4 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటన నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. న్యూయార్క్‌కు చెందిన రిటైర్డ్ న్యాయవాది అతుల్ తల్వార్‌కు అక్టోబర్ 17న కొందరు సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. తాము ఎన్ఐఏ, సీబీఐ అధికారులమని పేర్కొంటూ ’మీకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు మాకు సమాచారం అందింది‘ అంటూ తల్వార్‌ను బెదిరించారు.
అలా అతడిని 20 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. వీడియో, ఆడియో వాట్సాప్ కాల్స్ ద్వారా తల్వార్‌ను నిరంతరం గమనిస్తున్నట్టు రకరకాలుగా బెదిరిస్తూ అతడి నుంచి రూ.4 కోట్లను క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేయించుకున్నారు. డబ్బు బదిలీ చేసిన తర్వాత సందేశాలకు స్పందించకపోవడంతో మోసపోయినట్టు తల్వార్ గుర్తించారు. దీంతో సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సైబర్ సెక్యూరిటీ డీసీపీ శైవ్య గోయల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

