ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ
మెట్రో సీటు విషయంలో జరిగిన గొడవ చివరకు వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన శర్మ (48), ఆయన తల్లి దుర్గాదేవి (65) యమునా విహార్వైపు ఢిల్లీ మెట్రోలో వెళ్తున్నారు. మండి స్టేషన్ వద్ద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్ (65), ఆయన కొడుకు సిద్దార్థ్ సింగ్ ఎక్కారు. వారు శర్మ, ఆయన తల్లి వద్దకు వచ్చి సీనియర్ సిటిజన్ సీటు విషయంలో గొడవపడ్డారు.
- ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ : మెట్రో సీటు విషయంలో జరిగిన గొడవ చివరకు వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన శర్మ (48), ఆయన తల్లి దుర్గాదేవి (65) యమునా విహార్వైపు ఢిల్లీ మెట్రోలో వెళ్తున్నారు. మండి స్టేషన్ వద్ద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్ (65), ఆయన కొడుకు సిద్దార్థ్ సింగ్ ఎక్కారు. వారు శర్మ, ఆయన తల్లి వద్దకు వచ్చి సీనియర్ సిటిజన్ సీటు విషయంలో గొడవపడ్డారు. సంజయ్ ప్రతాప్ సింగ్ పవన శర్మను చెంప మీద కొట్టాడు. దీంతో పవన శర్మ ప్రతిఘటించడంతో సిద్దార్థ్ సింగ్ కూడా దాడి చేశాడు. ఈ దాడిలో పవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు పవన శర్మను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దుర్గాదేవి ఫిర్యాదుతో నిందితులు సంజయ్ ప్రతాప్ సింగ్, సిద్దార్థ్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

