Watch: బార్లో మద్యం నిరాకరణ.. రైఫిల్‌తో డీజేను కాల్చి చంపిన వ్యక్తి
DJ Shot Dead | బార్లో మద్యం నిరాకరించడంపై కొందరు వ్యక్తులు అక్కడున్న డీజేతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చాలా దగ్గర నుంచి డీజేపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ బార్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాంచీ: బార్లో మద్యం నిరాకరించడంపై కొందరు వ్యక్తులు అక్కడున్న డీజేతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చాలా దగ్గర నుంచి డీజేపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (DJ Shot Dead) ఆ బార్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్లోజ్ చేసిన బార్లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. తమకు మద్యం కావాలని డిమాండ్ చేశారు. అక్కడి సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
కాగా, ఆ గుంపులోని ఒక వ్యక్తి బయటకు వెళ్లాడు. టీ షర్ట్ తీసి ముఖానికి ముసుగులా కట్టుకున్నాడు. కేవలం షార్ట్‌తో బార్లోకి ప్రవేశించాడు. చేతిలో ఉన్న రైఫిల్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఐదుగురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన డీజే సందీప్‌ను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బార్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
रांची के एक्सट्रीम बार में डीजे सैंडी को गोली मारने का वीडियो, रात में 1:00 बजे के बाद गोली मारी गई है जबकि बार बंद करने का टाइम 11:00 है ऐसे में पुलिस का ढीला रवैया प्रश्न चिन्ह खड़ा करता है रांची में बहुत से बाहर दो-तीन बजे रात तक चलते हैं#xtremebarranchi #brekingnews #ranchi pic.twitter.com/p61Nu2KrvI
— Prem Shankar (@prem_sanmarg) May 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

