విడాకులకు అది కారణం కారాదు
స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: వివాహమైన తర్వాత సెక్స్ నిరాకరించడం క్రూరత్వంతో సమానమని, విడాకులకు అది కూడా ఓ కారణమైనప్పటికీ.. దాంపత్య జీవితాన్ని ముగింపు పలికేంత అసాధారణమైన కష్టమేమీ కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పార్లమెంట్ చట్టం కూడా ఇదే పేర్కొన్నదని గుర్తుచేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మీత్ సింగ్ బెంచ్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
వివాహమై ఏడాది పూర్తి కాకుండానే ఇద్దరు దంపతులు పెట్టుకున్న పరస్పర విడాకుల పిటిషన్ను కొట్టేసింది. ఈ భార్యాభర్తల విషయంలో ఫ్యామిలీ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. ఇరుపక్షాలు దాంపత్య జీవితాన్ని నిరాకరించిన నేపథ్యంలో విడాకుల కోసం పిటిషనర్లు ఇంతకుముందు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.