Ranveer Allahbadia: అల్లబదియా ముంబై ఫ్లాట్ లాక్.. మళ్లీ సమన్లు ఇచ్చిన పోలీసులు
Ranveer Allahbadia: ముంబైలోని అల్లబదియా ఇంటికి లాక్ ఉన్నది. విచారణ కోసం వెళ్లిన పోలీసులకు అతను కనిపించలేదు. దీంతో మరోసారి ఆ యూట్యూబర్‌కు సమన్లు జారీ చేశారు. పేరెంట్స్ సెక్స్‌పై అతను అనుచిత కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియా(Ranveer Allahbadia) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఉన్న అతని ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ ఎవరూ లేనట్లు గుర్తించారు. ఇటీవల ఓ యూట్యూబ్ షోలో.. పేరెంట్స్ సెక్స్ గురించి అతను కామెంట్ చేసిన విషయం తెలిసిందే.ఆ కేసులో అతనికి అస్సాం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారం ముంబైలోని అతని ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లారు. అక్కడ అతను లేనట్లు గుర్తించారు. ఇంటికి లాక్ వేశారు.దీంతో మళ్లీ అతనికి నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ముంబై పోలీసులు తెలిపారు.
బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్లో అల్లబదియా చాలా ఫేమస్. ఓ షోలో కాంటెస్టెంట్‌ను జుగుప్సాకరమైన ప్రశ్న వేయడంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పలు ప్రదేశాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని ఖార్ పోలీసు స్టేషన్‌కు రమ్మన్నారు. అయితే అతను రాకపోవడంతో రెండోసారి సమన్లు జారీ చేశారు. ఇంట్లోనే తన వాంగ్మూలం తీసుకోవాలని తొలుత ఖార్ పోలీసుల్ని అల్లబదియా కోరాడు. కానీ అతని విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు.
యూట్యూబర్‌పై గౌహతిలో కూడా పోలీసు కేసు నమోదు అయ్యింది. అల్లబదియాతో పాటు రైనా, ఆశిష్ చంచలాని, జస్ప్ర్పీత్ సింగ్, అపూర్వ మఖీజాలు కూడా విచారణకు అందుబాటులో ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

