Baba Ramdev | బాబా రాందేవ్ ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
Baba Ramdev | హమ్దార్డ్ కంపెనీ షర్బత్‌పై బాబా రాందేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేయనున్నది.
Baba Ramdev | హమ్దార్డ్ కంపెనీ షర్బత్‌పై బాబా రాందేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేయనున్నది. హమ్దార్డ్ ఉత్పత్తులకు సంబంధించి రాందేవ్ బాబా ఎలాంటి ప్రకటనలు చేయకుండా గతంలో కోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. యోగా గురువు ఎవరి నియంత్రణలో లేడని.. ఆయన తన సొంత ప్రపంచంలోనే నివరిస్తున్నాంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇటీవల హమ్దార్డ్ ఉత్పత్తులపై భవిష్యత్‌లో ఎలాంటి ప్రకటన చేయొద్దని ఢిల్లీ హైకోర్టు ఇటీవల యోగా గురువును ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉన్నా బాబా రాందేవ్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను విడుదల చేశారని జస్టిస్ అమిత్ బన్సాల్ పేర్కొన్నారు.
ఆయన ఎవరి నియంత్రణలో లేడని.. తన సొంత ప్రపంచంలో నివసిస్తున్నారన్నారు. ఆయన ఆలోచనలను తనలోనే ఉంచాలని, వాటిని వ్యక్తపరచాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హమ్దార్డ్ సంస్థకి చెందిన రూఅఫ్జాపై రామ్‌దేవ్ ఇకపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు, వీడియోలను పోస్ట్ చేయకూడదంటూ గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల దృష్ట్యా ఆయన అఫిడవిట్, వీడియో ప్రాథమికంగా కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయన్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా రామ్‌దేవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3న పతంజలికి చెందిన గులాబ్ షర్బత్ బ్రాండ్‌ని బాబా రాందేవ్ ప్రచారం చేశారు. రూ అఫ్జా నుంచి వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. షర్బత్ జిహాద్ అంటూ రూ అఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలపై హమ్దార్డ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు విచారణ సమయంలో బాబా రాందేవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను ఏ బ్రాండ్ పేరు కానీ.. కమ్యూనిటీ పేరు కానీ చెప్పలేదన్నారు. మహ్దార్డ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది పరువు నష్టం కేసును దాటిపోయిందని.. విభజనను సృష్టించే కేసు అంటూ వాదనలు వినిపించారు. కోర్టు రాందేవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రాందేవ్ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

