Pending bills | పెద్దల సభలో ఆ బిల్లు 33 ఏళ్లుగా పెండింగ్.. ఏ బిల్లు అంటే..!
Pending bills | రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇందులో ఓ బిల్లు 1992 నుంచి అంటే దాదాపు 33 ఏళ్లుగా పెండింగులో ఉంది. ఎగువసభ బులెటిన్ ప్రకారం.. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించిన బిల్లు ఇది.
Pending bills : రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇందులో ఓ బిల్లు 1992 నుంచి అంటే దాదాపు 33 ఏళ్లుగా పెండింగులో ఉంది. ఎగువసభ బులెటిన్ ప్రకారం.. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించిన బిల్లు ఇది. ఎన్నికల్లో పోటీచేసే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను పొందుపరిచారు. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు.
1997 నాటి ఢిల్లీ అద్దెల (సవరణ) బిల్లు కూడా సుదీర్ఘకాలంగా పెండింగులోనే ఉంది. ఈ బిల్లుపై పలు భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో ముందుకు కదల్లేదు. నాణ్యమైన విత్తనాల అమ్మకం, వీటి ఎగుమతి, దిగుమతులకు సంబంధిన సీడ్స్ బిల్లు 2004 నుంచి పెండింగులోనే ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులకు సంబంధించిన ఓ బిల్లు 2011 నుంచి ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు.
వీటితోపాటు భవన నిర్మాణ కార్మికుల బిల్లు, ఉపాధి కల్పన కార్యాలయాల బిల్లు సహా పలు బిల్లులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ రద్దైనప్పుడు పెండింగ్ బిల్లుల గడువు తీరిపోతుంది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ రద్దు కాదు. బిల్లులు సజీవంగా ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

