కరోనా సోకి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడి తండ్రి మృతి
Chetan Sakaria: రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియాకు పితృవియోగం సంభవించింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియాకు పితృవియోగం సంభవించింది. కొన్ని రోజులు క్రితం కరోనా మహమ్మారి బారినపడ్డ చేతన్ సకారియా తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వర్గాలు వెల్లడించాయి. చేతన్ సకారియా తండ్రి మృతికి ఆర్ఆర్ మేనేజ్మెంట్ తీవ్ర సంతాపం వ్యక్తంచేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింద
ఈ ఏడాది కరోనావల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ సీజన్-14లో చేతన్ సకారియా 7 వికెట్లు తీశాడు. ఇటీవలే టోర్నీ ఆగిపోవడం, ఇప్పుడు తండ్రి కరోనా కాటుకు బలికావడం సకారియాకు తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. సకారియా సోదరుడు కూడా నాలుగు నెలల క్రితమే మృతిచెందాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

