Odisha Train Tragedy | ఒడిశా దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణం: రైల్వే నివేదిక
Odisha Train Tragedy | సరిగ్గా నెల రోజుల కిందట జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) నివేదిక స్పష్టం చేసింది.
భువనేశ్వర్: సరిగ్గా నెల రోజుల కిందట జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) నివేదిక స్పష్టం చేసింది. ఈ భారీ ప్రమాదానికి సిగ్నలింగ్ విభాగం సిబ్బంది బాధ్యులని పేర్కొంది. విధ్వంసం, సాంకేతిక లోపం వంటి అవకాశాలను తోసిపుచ్చింది. మూడేళ్ళ కిందట భద్రతా కారణాల దృష్ట్యా సిగ్నల్ వ్యవస్థలో మార్పులు జరిగినట్లు తెలిపింది. అయితే కొంత మంది గ్రౌండ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ వ్యవస్థ తనిఖీలో తగిన భద్రతా విధానాలను అనుసరించలేదని ఆరోపించింది.
కాగా, సిగ్నలింగ్ విభాగంలోని భద్రతా ప్రక్రియలను పర్యవేక్షించే అధికారులతోపాటు డిజైన్ మార్పులను అనుసరించని ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణమని సీఆర్ఎస్ నివేదిక పేర్కొంది. ‘సర్క్యూట్లో చేసిన మార్పులను సెంట్రల్ డిజైన్‌లో చూపడంలో విఫలమయ్యారు. వార్షిక తనిఖీల్లో కూడా దీనిని గుర్తించలేదు. కాబట్టి ఈ ప్రమాదం కేవలం ఒక వ్యక్తి లోపం కాదు. కనీసం ఐదుగురు వ్యక్తుల తప్పిదం ఉంది’ అని రైల్వే అధికారి తెలిపారు.
మరోవైపు మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో నేరపూరిత కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) దర్యాప్తు నివేదికను వెల్లడించబోమని రైల్వే అధికారి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

