Maharastra speaker : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ స్పీకర్ (Assembly speaker) పదవికి బీజేపీ నేత (BJP leader) రాహుల్ నర్వేకర్ (Rahul Narvekar) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో నర్వేకర్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. రేపు మధ్యాహ్నం స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి విజయం సాధించింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
#WATCH | Mumbai, Maharashtra: BJP’s Rahul Narvekar files his nomination for Speaker’s post in the state Assembly, in the presence of Maharashtra CM Devendra Fadanvis, both Deputy CMs – Eknath Shinde and Ajit Pawar, BJP state chief Chandrashekhar Bawankule, Chandrakant Patil and… pic.twitter.com/Z04iuevTkB
— ANI (@ANI) December 8, 2024