న్యూఢిల్లీ, మే 16: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జూన్ 4న న్యూయార్క్లో జరిగే ర్యాలీలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాహుల్ 10 రోజుల అమెరికా పర్యటన ఈ నెల 31న ప్రారంభం కానున్నది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన జూన్ 22న ఖరారైన నేపథ్యంలో రాహుల్ కూడా అమెరికాలో పర్యటించనుండటం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. రాహుల్ తన పర్యటనలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.