Rahul Gandhi | ఈవీఎంలు బ్లాక్ బాక్సులవంటివే..! ఎలాన్ మస్క్ ట్వీట్‌కు రాహుల్ గాంధీ స్పందన
Rahul Gandhi | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని.. ఈ ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్‌లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని.. కనీసం వాటిని పరిశీలించేందుకు సైతం ఎవరికీ అనుమతి ఇవ్వరని విమర్శించారు.
Rahul Gandhi | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని.. ఈ ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్‌లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని.. కనీసం వాటిని పరిశీలించేందుకు సైతం ఎవరికీ అనుమతి ఇవ్వరని విమర్శించారు.
ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రస్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుందన్నారు. అయితే, మొబైల్ ఫోన్ సహాయంతో ఈవీఎంను హ్యాక్ చేసిన ఆరోపణలపై ముంబయి నార్త్ వెస్ట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్లతో గెలిచిన శివసేన (ఏక్నాథ్ షిండే) ఎంపీ అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువుపై కేసు నమోదైన కేసుకు సంబంధించిన క్లిప్పింగ్‌ను సైతం రాహుల్ జతచేశారు.
రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 25వేల మందికిపైగా లైక్ చేశారు. మరో ఎలాన్ మస్క్ ట్వీట్‌పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సైతం స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరన్నారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని.. వాటికి ఎలాంటి కనెక్టివిటీ లేదరన్నారు. బ్లూటూత్, వైఫై లేదని.. ఇంటర్నెట్ సదుపాయం లేదరన్నారు. రీప్రోగ్రామ్ చేయలేరని ఫ్యాక్టరీ ప్రోగ్రామ్డ్ కంట్రోలర్లని పేర్కొన్నారు.
EVMs in India are a “black box,” and nobody is allowed to scrutinize them.
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

