Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Rahul Gandhi: అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్దోషిగా తేలారు. 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆ నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారు. అయితే యూపీలోని బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు.
సుల్తాన్పూర్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిర్దోషిగా తేలారు. 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆనాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారు. అయితే యూపీలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. బెంగుళూరులో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సుల్తాన్పూర్ కోర్టు ఆ కేసులో తన తీర్పును వెలువరిస్తూ రాహుల్ గాంధీ నిర్దోషి అని, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా లేవని కోర్టు పేర్కొన్నది.
ఇవాళ తీర్పు సందర్భంగా స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 2018లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా క్రిమినల్ పరువునష్టం కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 2023లో రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ తర్వాత బెయిల్ తీసుకున్నారు. తొలుత అక్టోబర్ 13వ తేదీన తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ అక్టోబర్ 26వ తేదీకి మార్చారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్లు ఆర్ఎస్ చీమా, అడ్వకేటు కాశి శుక్లా, తరన్నుమ్ చీమా, ప్రసన్న ఎస్, ఆకాశ్ సింగ్ వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

