లోకతంత్రం కాదు.. బీజేపీది లూటీ తంత్రం: సీఎం భగవంత్‌మాన్
Punjab CM Bhagwantmann Singh : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందని, ఏవైనా ప్రత్యేక కండ్ల అద్దాలు తయారు చేసి ఉంటే, ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భగవంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాల
ఖమ్మం: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందని, ఏవైనా ప్రత్యేక కండ్ల అద్దాలు తయారు చేసి ఉంటే, ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భగవంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
యువత ఉద్యోగాలు ఆశిస్తున్నారని, రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారని, కానీ అవన్నీ జుమ్లాలుగా ఉండిపోయాయన్నారు. ఖాతాలోకి 15 లక్షల వస్తాయని హామీ ఇచ్చారు కానీ, అది కూడా అబ్ధంగా నిలిచిపోయిందని బీజేపీని విమర్శించారు. బీజేపీ అబద్ధాల పార్టీగా మారుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. లోకతంత్రం కాదు.. లూటీ తంత్రాన్ని బీజేపీ నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. కానీ సమయం అన్నీ నేర్పుతుందని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుందని ఆయన బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
ప్రతి ఆగస్టుకు ప్రధాని ఢిల్లీ నుంచి సందేశం ఇస్తారని, కానీ ఎప్పుడూ ఆ ఉపన్యాసమే ఉంటుందని ఆయన విమర్శించారు. ఉగ్ర దాడుల పట్ల చింతను వ్యక్తం చేస్తూ.. ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తారని, ఆ ప్రసంగాన్ని మార్చుకోవాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. అన్ని లూటీ చేయడమే బీజేపీ పని అని, రైల్వే, ఎల్ఐసీ, ఎయిర్‌పోర్టులను అన్నింటినీ అమ్మిందన్నారు. కేవలం మీడియాను కొనుగోలు చేసిందన్నారు. అన్ని తమకోసమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలను గెలుచుకోవాలని ఆరాటపడుతోందన్నారు.
కేజ్రీవాల్ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసిందని, కానీ ట్రంప్ సతీమణి స్కూల్ చూడాలంటే, కేజ్రీవాల్ స్కూల్‌ను చూపించారని భగవంత్ విమర్శలు చేశారు. పంజాబ్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం లాంటి పథకాలను ప్రవేశపెడుతామన్నారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలన్నారు. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజులన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంచి హృదయం ఉన్న నేతలు ఈ దేశంలో లేరని, వాళ్లుంటే ఈ దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. తన ప్రసంగం ముగించే ముందు ఇన్కిలాఫ్ నినాదం చేశారు. జిందా రహేతో ఫిర్ మిలేంగే.. మిల్తే రహేతో జిందా రహీంగే అంటూ భగవంత్ మాన్ పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

