మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు

- కరోనా నేపథ్యంలో అదనపు పోషకాహారంగా అందజేత
- కేంద్ర విద్యాశాఖ అనుమతి
- ఈ ఏడాది నుంచే అమలు
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 రోజులపాటు 4.48 లక్షల మందికి బెల్లం, లేత మొలకలు అందించేందుకుగాను రూ.13.70 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించనున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 222 రోజులు, ఎన్సీఎల్పీ స్కూళ్లల్లో 285 రోజులపాటు మధ్యాహ్న భోజనాన్ని అందజేయనున్నారు. 54,232 మంది కుక్ కమ్ హెల్పర్లను కొనసాగించేందుకు అనుమతులు లభించాయి. మొత్తంగా 41 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగించనున్నారు. ఈ ఏడాది మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి రూ.282 కోట్లు ఖర్చుచేయనున్నారు.


Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

