12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు.. e-KUMBH పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము
e-KUMBH portal: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఈ-కుంభ్(e-KUMBH )పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తూ సుమారు 12 భాషలకు చెందిన పుస్తకాలను ఆ సైటలో పొందుపరిచారు. e-KUMBH అనగా నాలెడ్జ్ అన్లీష్డ్ ఇన్ మల్టిపుల్ భారతీయ లాంగ్వేజెస్. ఈ వెబ్ పోర్టల్‌లో ఇంజినీరింగ్ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్
భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఈ-కుంభ్(e-KUMBH )పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తూ సుమారు 12 భాషలకు చెందిన పుస్తకాలను ఆ సైటలో పొందుపరిచారు. e-KUMBH అనగా నాలెడ్జ్ అన్లీష్డ్ ఇన్ మల్టిపుల్ భారతీయ లాంగ్వేజెస్. ఈ వెబ్ పోర్టల్‌లో ఇంజినీరింగ్ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ పుస్తకాలను ఒడియా భాషలో రాష్ట్రపతి ముర్ము రిలీజ్ చేశారు. కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ(సీఎస్టీటీ) ఒడియా భాషలో డెవలప్ చేసిన సుమారు 50వేల టెక్నికల్ టర్మ్స్‌ను కూడా ఆ భాష సైట్లో పొందుపరిచారు.
ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పుస్తకాలను 12 భారతీయ భాషల్లోకి తర్జుమా చేసినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, గుజరాత్, కన్నడ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు ట్రాన్స్‌లేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఇక ఉర్దూ, మలయాళం భాషల్లో తర్జుమా పని జరుగుతోందన్నారు. ఇంగ్లీష్ లేకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ అర్థరహితంగా ఉంటుందని చాలా మంది వాదిస్తారని, కానీ ప్రపంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్న దేశాల్లో చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయని, ఆ దేశాలు ఏవీ ఇంగ్లీష్‌పై ఆధారపడవని, స్వంత భాషల్లోనే ఆ దేశాల్లో పాఠ్యపుస్తకాలు ఉంటాయని మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

