Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కొత్త కమిషనర్లు..! 15లోగా భర్తీ చేయనున్న సెలక్షన్ కమిటీ..!
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇంతకు ముందు కమిషనర్లుగా కొనసాగిన అనూప్ చంద్రపాండే పదవీ విరమణ చేయగా.. అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించే తరుణంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ఆమోదం తెలిపారు. ఈ ఖాళీలను మార్చి 13లోగా భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది.
హోం సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) సెక్రటరీతో కూడిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొదట రెండు పోస్టులకు ఐదుగురి పేర్లతో రెండు వేర్వేరు పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రధాని మంత్రి నేతృత్వంలోని కమిటీ ఇద్దరు కమిషనర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ ర ఉంటారు. అయితే, కమిటీలో సభ్యుల సౌకర్యాన్ని బట్టి ఈ నెల 13, 14 తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 15లోగా నియామకాలను పూర్తి చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

