Sonia Gandhi: మోదీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదు: సోనియా గాంధీ
Belonging: A Journey of Love: సోనియా గాంధీ జీవిత విశేషాలతో కూడిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం మార్కెట్లోకి రిలీజైంది. ఆ బుక్‌లో ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు. ప్రధాని మోదీ గురించి ఆ బుక్‌లో రాస్తూ.. ఆయనతో తనకు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) ఆత్మకథకు చెందిన *బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్* పుస్తకం మార్కెట్లోకి రిలీజైంది. హార్పర్ కొల్లిన్స్ ఇండియా ఆ బుక్‌ను ప్రచురించింది. ఆ పుస్తకంలో సోనియా తన మనోభావాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనదైన విజన్‌తో భారత్ కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఇక తాను కూడా తనదైన శైలిలో భారత్ ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ప్రధాని మోదీతో తనకు నిజమైన కాంటాక్ట్ జరగలేదన్నారు. ఎప్పుడైనా ముఖాముఖీగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు.. అప్పుడు ప్రధాని మోదీ మరో వైపు చూస్తుంటారని, కండ్లల్లో కండ్లు పెట్టి చూసే అవకాశం ఇవ్వరని సోనియా తన పుస్తకంలో రాశారు. అయితే ఆర్ఎస్ఎస్ శైలిలోనే దేశం కోసం మోదీ పనిచేస్తున్నారని సోనియా తెలిపారు. ప్రధాని మోదీ ఇమేజ్ కోసం పనిచేస్తున్న పీఆర్ టీమ్ తరహాలో ఆయన మూలాలు లేవని ఆమె రాశారు.
ఈ బుక్ రాసే సమయానికి ప్రధానిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ 12 ఏళ్లు అవుతోందని, ప్రస్తుతం ఆయన మూడోసారి పీఎం అయ్యారని, ఇప్పటి వరకు ప్రాక్టికల్‌గా ఆయనతో రియల్ కాంటాక్ట్ జరగలేదని, సెమీ అఫీషియల్ మీటింగ్స్‌లో కొన్ని సందర్భాల్లో ఎదరుపడ్డామని, పార్లమెంట్ సెషన్ ముగింపు లాంటి సందర్భాల్లో ఈ ఘటన జరిగిందని, స్పీకర్ ఛాంబర్లో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఆ సమయంలో ఒకర్ని ఒకరు విషెస్ చెప్పుకుంటారని బుక్‌లో సోనియా పేర్కొన్నారు. స్పీకర్ ఛాంబర్ అనేది ఓ చిన్న రూమ్ అని, అక్కడికి చాలా మంది ఎంపీలు వస్తారని, కానీ ఎప్పుడైతే మోదీ తనతో ఫేస్ టు ఫేస్ ఎదురుపడుతారో, ఆ సమయంలో కేవలం నమస్తే అని చెప్పుకుని దూరం వెళ్తామని, అయితే ఈ విధానం గతంతో పోలిస్తే భిన్నమైందని, గతంలో విభిన్న పార్టీ నేతలు ఒకర్ని ఒకరు పలకరించుకునేవారని, కంటి చూపుతో కలిసే సందర్భాన్ని మోదీ తప్పించుకుంటారని సోనియా గాంధీ తన బుక్‌లో పేర్కొన్నారు.
ఓ సందర్భంలో ఆస్పత్రి చికిత్స తర్వాత మోదీ ఎదురుపడ్డారని, అప్పుడు ఆయన ఆరోగ్యం బాగుందా అని అడిగారని, అవును అని తాను సమాధానం ఇచ్చినట్లు సోనియా తన బుక్‌లో తెలిపారు. ఇలాంటి సందర్భాలే తప్ప.. ఎప్పుడు కూడా మోదీతో వ్యక్తిగత సంభాషణలు జరగలేదన్నారు. బర్త్‌డే, న్యూఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం మామూలే అన్నారు. విభిన్న సిద్ధాంతాలతో ఇద్దరం ఉన్నామని, మోదీ ఐడియాలజీ తనకు భిన్నమైందని సోనియా బుక్‌లో వెల్లడించారు. ఇండియా గురించి తన కుటుంబం నుంచి తెలుసుకున్నట్లు చెప్పారు. తన ఫ్యామిలీ చేసిన దేశసేవ, దేశం పట్ల వారి నమ్మకం, సంస్కృతులు, భాషల నుంచి నేర్చుకున్నట్లు సోనియా బుక్‌లో తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం ఈ దేశానికి ముఖ్యమన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి ఉద్భవించారని, ఆ అనుభవాలతో ఆయన ఎదిగారని, ఆ విశ్వాసం, కల్చర్‌తో కొనసాగుతున్నారని తెలిపారు.
భారత్‌ను ఏ తరహాలో చూడాలని ఉందో, ఆ తరహాలో మోదీ పనిచేస్తున్నారని, అది ఆయన విజన్ అని, కానీ తన విజన్ వేరు అని సోనియా రాశారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నట్లు సోనియా తన బుక్‌లో చెప్పారు. సమగ్రతకు, సెక్యులరిజానికి, సామాజిక న్యాయానికి భారత్ ప్రతీకగా నిలుస్తుందని, తన విజన్ వ్యక్తిగతం కాదు అని సోనియా తన బుక్‌లో తెలిపారు. మోదీ రాజకీయ ప్రవేశం తనకు భిన్నమైందన్నారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతున్న శైలి.. బహిరంగసభల తరహాలో ఉంటుందని అన్నారు. ఎక్కువ శాతం విపక్షాన్ని టార్గెట్ చేస్తారన్నారు. ఆ పార్టీ ఎప్పుడు మొదట మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను టార్గెట్ చేస్తుందన్నారు. సంఘ్ పరివార్‌కు చెందిన ఇంటర్నెట్ సైట్లు అన్ని నెహ్రూకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం కలిగి ఉంటాయని బుక్‌లో రాశారు.
కాంగ్రెస్ రహిత భారత్‌ను మాత్రమే బీజేపీ కాంక్షిస్తున్నట్లు సోనియా తన బుక్‌లో ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ నుంచి రావడం వల్ల ప్రధాని మోదీలో ఈ భావాలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని వల్ల కరుడుకట్టిన హిందుత్వవాదిగా మారారని, అదే రాజకీయ ఎజెండాగా మారిందన్నారు. భారత దేశంలో గత కొన్ని శతాబ్ధాలుగా పాటిస్తున్న విశ్వాసాల గురించి తన అత్త నుంచి నేర్చుకున్నట్లు సోనియా తెలిరు. సమ్మిళతమైన విశ్వాసాలు, నమ్మకాలు ఇక్కడ ఉంటాయన్నారు. ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రవక్త, ఒక్కటే గ్రంధం అన్న విధానానికి కట్టుబడి ఉండరన్నారు. భిన్నాభిప్రాయాల సంస్కృతి ఇక్కడ ఉందన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్లుగానే అహింస, ధర్మ మార్గంలో తాను విద్యాభ్యాసం కొనసాగించినట్లు చెప్పారు. ఆ రకంగానే ఆమోదించడం, అర్థం చేసుకోవడం జరుగుతోందన్నారు. దేశంలో ఉన్న శతాబ్ధాల నాటి కుల వ్యవస్థ భారతీయ సమాజాన్ని నిర్మించిందని, అసమానత్వం.. అణిచివేత దాని సమస్యలే అని, కానీ హిందూమతానికి చెందిన కొందరు ప్రముఖ సంస్కర్తలు కుల వ్యవస్థను తమదైన శైలిలో ప్రశ్నించారని సోనియా తన బుక్‌లో రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: మోదీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదు: సోనియా గాంధీ
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
Ram Charan | ‘ఇట్లు అర్జున’ ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. ‘కాకా’ మూవీపై బిగ్ అప్డేట్!
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

