Plot To Topple Vijay Govt | విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. టీవీకే ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్, ముగ్గురు అరెస్ట్
Plot To Topple Vijay Govt | తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించే ప్లాన్‌ను భగ్నం చేసినట్లు ఆ రాష్ట్ర నిఘా విభాగం పేర్కొంది.
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించే ప్లాన్‌ను భగ్నం చేసినట్లు ఆ రాష్ట్ర నిఘా విభాగం పేర్కొంది. రూ.35 కోట్లు ఆఫర్ పొందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Plot To Topple Vijay Govt) ఉత్తంగరైకి చెందిన టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా సంచలన ఆరోపణలు చేశారు. ఐపీడీఎస్ అనే కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తనకు రూ. 35 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ స్పీకర్, టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్‌పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తనను బెదిరించడంతోపాటు ఈ ఆఫర్ గురించి ఎవరికీ చెప్పవద్దని తనను హెచ్చరించినట్లు చెన్నై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
కాగా, టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఫిర్యాదుపై ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించిన తర్వాత డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడు ఆశోక్‌కు సన్నిహితులైన మరో ఇద్దరిని కరూర్‌లో అరెస్ట్ చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామితో డీఎంకే కుమ్మక్కైందని టీవీకే మంత్రి సీటీ నిర్మల్ కుమార్ ఆరోపించారు. ‘ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు, సెంథిల్ బాలాజీ వంటి కీలక డీఎంకే నేతలు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. రూ.10 కోట్లు, రూ.20 కోట్లు లేదా రూ.50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేస్తున్నారు. వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు’ అని అన్నారు. సెంథిల్ బాలాజీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులు, ‘కరూర్ గ్యాంగ్’కు చెందిన వారు, ఈ వ్యవహారంలో నేరుగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే టీవీకే ఆరోపణలను డీఎంకే ఖండించింది. ఆ పార్టీ కట్టుకథ అల్లుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ విమర్శించారు. ‘దర్యాప్తు వివరాలు లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని టీవీకే భావిస్తోంది. వారి వద్ద వాస్తవాలు లేవు. కేవలం ఒక కథనాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని ఇది రుజువు చేస్తోంది’ అని అన్నారు. పక్కా ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయాలని టీవీకే ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Arrests
- Cores Offer
- DMK Link
- plot
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

