పెగాసస్‌తో నిఘా.. సిట్ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిల్

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. లాయర్ ఎంఎల్ శర్మ ఆ పిల్ వేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు సీబీఐని ఆ పిల్లో పార్టీలుగా చేర్చారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో భారతీయ పౌరులపై రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా పెట్టినట్లు ఆ పిల్లో ఆరోపించారు. సుప్రీం వేసిన సిట్ ఆధ్వర్యంలో దీనిపై దర్యాప్తు జరగాలని పిల్లో కోరారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలపై నిఘా పెట్టే అధికారం ప్రధానికి, ఆయన మంత్రులకు ఉంటుందా అని పిల్లో శర్మ అడిగారు. సాఫ్ట్‌వేర్‌ను లీగల్‌గా ఖరీదు చేశారా అని ప్రశ్నించారు. సాధారణ పౌరులపై స్నూపింగ్.. హక్కుల ఉల్లంఘన అవుతుందా అని ప్రశ్నించారు.
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన మంత్రులను, పౌరులపై స్నూపింగ్ చేసినవారిని చట్టం ప్రకారం శిక్షించాలన్నారు. ప్రతిపక్ష నేతలు, రాజకీయవేత్తలు, కార్యకర్తలు, అడ్వకేట్లు, ఇతరులపై 2017 నుంచి స్నూపింగ్ జరుగుతోందని, ఆ చర్యలకు పాల్పడినవారిని శిక్షించాలన్నారు. నిఘా కోసం సాఫ్ట్‌వేర్‌ను కొనడం అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని పిల్లో సుప్రీంకోర్టును కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

