ITBP: ఆఫీసర్‌గా కూతురు.. సెల్యూట్ చేస్తూ మురిసిపోయిన తండ్రి.. ఫొటో వైరల్
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP ) తొలిసారి మహిళా ఆఫీసర్లను తమ బలగాల్లోకి తీసుకున్న సందర్భమే మరో అరుదైన క్షణానికి వేదికైంది. మొత్తం 53 మంది అధికారులు ముస్సోరిలోని ITBP ట్రైనింగ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు.

న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP ) తొలిసారి మహిళా ఆఫీసర్లను తమ బలగాల్లోకి తీసుకున్న సందర్భమే మరో అరుదైన క్షణానికి వేదికైంది. మొత్తం 53 మంది అధికారులు ముస్సోరిలోని ITBP ట్రైనింగ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. వీళ్లలో 42 మంది అసిస్టెంట్ కమాండెంట్స్ (జీడీ), 11 మంది అసిస్టెంట్ కమాండంట్స్ (ఇంజినీర్స్) ఉన్నారు. అయితే ఇందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ప్రకృతి, దీక్ష అనే ఈ ఇద్దరూ పారామిలిటరీలో ఎంట్రీ లెవల్ ఆఫీసర్ ర్యాంక్ అయిన అసిస్టెంట్ కమాండంట్‌గా నియమితులయ్యారు.
వీళ్లలో దీక్ష తండ్రి కమలేష్ కుమార్ ఇప్పటికే ITBPలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెర్మనీ సందర్భంగా ఈ తండ్రీ కూతుళ్లు కలిశారు. దీంతో ఆ తండ్రి తన కూతురిని చూసి ఎంతో గర్వంగా సెల్యూట్ చేసి మురిసిపోయారు. దీక్ష కూడా నవ్వుతూ ఆయనకు సెల్యూట్ చేసింది. ఈ తండ్రీ కూతుళ్లు ఒకరికొకరు సెల్యూట్ చేసుకున్న ఫొటో వైరల్‌గా మారింది. ITBP అధికారిక ట్విటర్ ఈ ఫొటోను షేర్ చేసింది. తనకు తన తండ్రే రోల్ మోడల్ అని, ఆయనే తనను ఎంతగానో మోటివేట్ చేశారని ఈ సందర్భంగా దీక్ష చెప్పింది.
Saluting the daughter with pride…
— ITBP (@ITBP_official) August 8, 2021
Diksha joined ITBP as Assistant Commandant. His father Insp/CM Kamlesh Kumar of ITBP salutes her after the Passing Out Parade and attestation ceremony at ITBP Academy, Mussoorie today. #Himveers pic.twitter.com/v8e1GkQJYH
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

