వచ్చేవారం పెట్రో బాంబ్!
సామాన్యుడి నెత్తిపై మళ్లీ పెట్రో బాంబు పడనున్నదా? పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యరీతిన పెరుగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
- లీటర్‌పై రూ.9-12 పెంపు అవకాశం
- సంస్థలకు మోదీ సర్కార్ అనుమతి?!
- జేపీ మోర్గాన్, ఐసీఐసీఐ అంచనా
- ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగింపే కారణం
న్యూఢిల్లీ, మార్చి 4: సామాన్యుడి నెత్తిపై మళ్లీ పెట్రో బాంబు పడనున్నదా? పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యరీతిన పెరుగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండిపోతుండటం మళ్లీ పెట్రో మోత ప్రారంభానికి కారణాలుగా కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. లీటర్‌పై రూ.9 పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ తాజా నివేదికలో పేర్కొనగా, కంపెనీలు తమ మార్జిన్లను మునుపటి స్థితికి తీసుకెళ్లేందుకు ఈనెల 16లోపు రూ.12 పెంచాల్సి వస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొన్నది. ఈనెల 7తో ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఆ మరుసటి రోజు నుంచే ధరలు సవరించేందుకు మోదీ ప్రభుత్వం చమురు సంస్థలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఈ పెంపు దశలవారీగా ఉండాలని సూచించినట్టు తెలుస్తున్నది.
ఎన్నికల కారణంగానే స్తబ్ధుగా ధరలు!
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరమే రోజువారీ పెరుగుదల ప్రారంభమౌతుందని జేపే మోర్గాన్ అంచనా వేసింది. 2014 తర్వాత క్రూడాయిల్ ధరలు ఏడేండ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 110 డాలర్లకు పైగా చేరింది. ఉక్రెయిన్‌తో నెలకొన్న సంక్షోభం, పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇంధన దిగ్గజ దేశంగా ఉన్న రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్న భయాందోళనల మధ్య ఇది చోటుచేసుకున్నది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకి చెందిన పీఎసీసీ గణాంకాల ప్రకారం మార్చి 1 నాటికి భారత్.. బ్యారెల్ క్రూడాయిల్‌ను 102 డాలర్లకు కొంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిలిపిన గతేడాది నవంబర్‌లో ఇది 81.5 డాలర్లుగా ఉన్నది.
బ్యారెల్ ధర 150 డాలర్లకూ చేరొచ్చు
ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 10 శాతం రష్యా నుంచే వస్తున్నది. 2021 గణాంకాల ప్రకారం భారత్ రష్యా నుంచి రోజుకు సరాసరిన 43,400 బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ఇది భారత్ మొత్తం దిగుమతుల్లో 1 శాతం మాత్రమే. సరఫరాలో మనకు పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ, అంతర్జాతీయ ధరల పెరుగుదలే ఆందోళన కలిగిస్తున్నది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి బ్యారెల్ ఆయిల్ ధర 86 డాలర్లకు తగ్గివస్తుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఇదే సమయంలో రష్యా నుంచి ఎగుమతులు ఆగిపోతే 150 డాలర్లకు కూడా చేరే అవకాశం లేకపోలేదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- barrel
- petrol prices
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

