Robotic Elephant | త్రిసూర్ భద్రకాళీ ఆలయానికి బహుమతిగా రోబోటిక్ ఏనుగు.. Video
Robotic Elephant | కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Trissur) లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా (Sri Bhadrakali Vishnu Maya) ఆలయానికి భారీ రోబోటిక్ ఏనుగు (Robotic Elephant) బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్ (Anita Dongre Foundation), పెటా ఇండియా (Peta India) సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ (Punnakkaparambil Mahadevan)’ అనే ఈ భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చారు.
Robotic Elephant : కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Trissur) లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా (Sri Bhadrakali Vishnu Maya) ఆలయానికి భారీ రోబోటిక్ ఏనుగు (Robotic Elephant) బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్ (Anita Dongre Foundation), పెటా ఇండియా (Peta India) సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ (Punnakkaparambil Mahadevan)’ అనే ఈ భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చారు. మలయాళ నూతన సంవత్సరమైన విషు వేడుకల సందర్భంగా భక్తుల సమక్షంలో ఆలయ నిర్వాహకులు ఈ ఏనుగును ఆవిష్కరించారు.
పురాతన కాలం నుంచి ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలను ఏనుగుల అంబారీలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇందుకు నిజమైన ఏనుగులను వినియోగిస్తుండటంవల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. ఏనుగులు అకస్మాత్తుగా బెదిరి బీభత్సం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఉత్సవాల్లో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా సురక్షితంగా ఉత్సవాలను నిర్వహించుకోవడం కోసం ఆలయాలకు ఈ రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇస్తున్నట్లు పెటా ఇండియా తెలిపింది.
కేరళ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు పెటా ఇండియా రోబోటిక్ ఏనుగులను బహుమతులుగా ఇస్తూ వస్తున్నది. వాటిలో ఈ ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అనే ఏనుగు 14వది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలకు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇచ్చినట్లు పెటా ఇండియా తెలియజేసింది.
Celebrations at Punnakkaparambil Sree Bhadrakali Vishnumaya Temple will now be kinder, with the arrival of #mechanicalelephant, Punnakkaparambil Mahadevan, allowing real elephants to thrive in nature with their families.🐘💚@anitadongre #RoboticPunnakkaparambilMahadevan… pic.twitter.com/Wu2uKGbrqH
— PETA India (@PetaIndia) April 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

