Arrest | విమానం రన్‌వేపై కదులుతుండగానే కిందకు దూకిన ప్రయాణికుడు.. తర్వాత ఏమైందంటే..!
Arrest | షార్జా (Sharjah) నుంచి వచ్చిన విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (Chennai International Airport) లో ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో, తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Arrest : షార్జా (Sharjah) నుంచి వచ్చిన విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (Chennai International Airport) లో ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో, తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ వేకువజామున షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానం (Air Arabia Flight) చైన్నై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. ఆ విమానం ట్యాక్సీవేపై కదులుతుండగానే సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరచి కిందకు దూకాడు.
ఈ సంఘటన జరిగిన వెంటనే పైలట్ గ్రౌండ్ సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడు కిందకు దూకినప్పుడు విమానం ఇంకా నెమ్మదిగా కదులుతూనే ఉందని, ఈ ఘటనలో ప్రయాణికుడికిగానీ, విమానానానికిగానీ ఎలాంటి నష్టం జరగలేదని విమానాశ్రయ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
విమాన ప్రయాణం సమయంలో అతడు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. తనకు వామ్టింగ్ వస్తున్నదని అతను విమానంలో సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడని, విమానంలో కూడా రెండుసార్లు వామ్టింగ్ చేసుకున్నాడని చెప్పారు. బయటికి వస్తుండగా మరోసారి వామ్టింగ్ రావడంతో అతడు విమానం నుంచి కిందకు దూకి ఉండవచ్చని అన్నారు. ఆ ప్రయాణికుడిని తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన వల్ల కొద్దిసేపు విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

