ఆ చిలుక ఆచూకీ చెప్తే రూ. 50 వేల నజరానా
బెంగళూరు : అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ చిలుక తప్పిపోయింది. దీంతో ఆ చిలుక యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తప్పిపోయిన చిలుక ఆచూకీ చెప్తే రూ. 50 వేలు నజరానా ఇస్తానని ప్రకటన చేశాడు. చిలుక ఆచూకీ కోసం ఆ యజమాని కుటుంబం విస్తృతంగా గాలిస్తోంది.
కర్ణాటకలోని తుమకూరు జయనగర్ కాలనీకి చెందిన జంతు ప్రేమికుడు రవి.. ఆఫ్రికాకు చెందిన ఓ రెండు చిలుకలను పెంచుకుంటున్నాడు. ఈ రెండింటిలో ఒక చిలుక రుస్తుమా జులై 16వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమైంది. చిలుక తప్పిపోవడంతో రవి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. దాన్ని ఆచూకీ తెలుపాలని కోరుతూ.. పోస్టర్లను విడుదల చేసింది. చిలుక ఎక్కడైనా కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని, వారికి రూ. 50 వేలు నజరానా ఇస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. తప్పిపోయిన చిలుకతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నాడు. దాన్ని తీవ్రంగా మిస్ అవుతున్నామని తెలిపాడు. ఆ చిలుకతో గడిపిన సందర్భాలు గుర్తుకు వస్తుంటే ఎంతో బాధేస్తుందన్నాడు. ఇక ఆ రెండు చిలుకల పుట్టిన రోజు వేడుకలను ఆ కుటుంబం ఎంతో గొప్పగా నిర్వహిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

