Parag Jain | రా చీఫ్‌గా పరాగ్ జైన్ నియామకం.. జులై 1న బాధ్యతలు
Parag Jain | ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (RAW) చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (Parag Jain) నియమితులయ్యారు.
Parag Jain | ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (RAW) చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ (Parag Jain) నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈనెల 30తో ముగియనుండటంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్ జైన్‌ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న పరాగ్ జైన్ రా చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
పరాగ్ జైన్.. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.
Also Read..
Plane Crash | నిఘా వర్గాల హెచ్చరిక.. విమాన ప్రమాద దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీ భద్రత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

