యూఎన్ జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్.. మండిపడ్డ భారత్
Kashmir issue | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్ అక్రమ్
United Nations | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ ప్రస్తావించగా.. భారత్ విరుచుకుపడింది. కశ్మీర్‌లోని పరిస్థితులను రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో పోల్చగా.. ఐక్యరాజ్య సమిథిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో రష్యా యద్ధం వంటి తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఈ ఫోరమ్‌ను ఓ ప్రతినిధి బృందం దుర్వినియోగం చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
నా దేశంపై పలికిమాలిన, అర్థం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆమె మాట్లాడుతూ పదేపదే అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్న దేశాలు ఎప్పుడూ సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తాయని.. కానీ, దానివల్ల ప్రయోజనం లేదని రుచిరా కాంబోజ్ అన్నారు. పాక్ ప్రతినిధి విశ్వసించినా.. లేకపోయినా జమ్మూకశ్మీర్ మొత్తం ఎల్లప్పడూ భారత్‌లో అంతర్భాగమేనని.. విడదీయరాని బంధం ఉంటుందన్నారు. పౌరులు తమ జీవించే హక్కును, స్వేచ్ఛను ఆస్వాదించగలిగేలా ఉగ్రవాదాన్ని ఆపాలని తాము పాక్‌ను కోరుతున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

